తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 39 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. నిన్న స్వామి వారిని 79 వేల 251 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 38 వేల 549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న లక్ష్మీనాథుని హుండీ ఆదాయం 4కోట్ల 10లక్షల రూపాయలుగా అధికారులు లెక్కతేల్చారు.
ఇది కూడా చదవండి.