రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బౌలర్ అశ్విన్ చేసిన 'మన్కడింగ్' వివాదాస్పదమైంది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే స్పందించాడు. అనవసర చర్చ ఎందుకని అన్నాడు. మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని చూసుకుంటారని తెలిపాడు.
ఈ వివాదంపై మాట్లాడనుకోవట్లేదు. రిఫరీ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఫలితం ఏదైనా అంగీకరిస్తాం. చెప్పాలంటే మేం బాగానే బ్యాటింగ్ చేశాం. చివరి 4 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు -అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
జైపూర్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది.