రేపు ఉదయం 9 గం.కు తెలంగాణ భవన్‌లో తెరాస ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యేలను హస్తం పార్టీ నేతలు కొనుగోలు చేసినపుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే శాసనసభ్యులు పార్టీ మారుతున్నట్లు చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యం... లారీ కిందపడి ఒకరి దుర్మరణం