ETV Bharat / briefs

అనాథ వృద్ధురాళ్లకు అతడు మరో కొడుకు

అతడు ముస్లిం యువకుడు. సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి ఓ అనాథ వృద్ధురాలికి తలకొరివి పెట్టాడు. హన్మకొండకు చెందిన హకీం పర్వేజ్ హైందవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అతని కుటుంబానికి హిందూ ముస్లిం అనే తేడా లేదు. అందరినీ... ఆదరిస్తారు. వీరు నడుపుతున్న సహృదయ ఆశ్రమంలో ఎంతోమంది కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ వృద్ధులను కంటికిరెప్పలా చూసుకుంటూ.. వారికి అండగా నిలబడుతోంది సహృదయ అనాథ వృద్ధాశ్రమం.

author img

By

Published : Apr 12, 2019, 4:35 PM IST

వృద్ధురాళ్లకు అతను మరో కొడుకు

ఓ దంపతులు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదరిస్తే... వారి కుమారుడు వసతిగృహంలో తనువు చాలించిన వృద్ధులకు తల కొరివి పెట్టి మానవత్వాన్ని బతికిస్తున్నాడు. కన్న బిడ్డలు కాదనుకున్న తల్లిదండ్రులకు ఆ యువకుడు దేవుడిచ్చిన బిడ్డలా.. కర్మకాండ నిర్వహిస్తున్నాడు.

తల్లిదండ్రుల బాటలో...

హన్మకొండలో సహృదయ అనాథ వృద్ధాశ్రమం ద్వారా చోటే మియా, యాకూబ్ బి ముస్లిం దంపతులు ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కన్న బిడ్డలు కాదని బజారున పడేసిన వృద్ధులకు కుమార్తె ప్రేమను, కుమారుడి ఆప్యాయతను పంచుతున్నారు. వీరి నీడలో తనువు చాలించిన వారికి ముస్లిం దంపతులే కర్మకాండ నిర్వహించి మానవత్వాన్ని చాటుతున్నారు. తల్లిదండ్రుల సేవా భావాన్ని చూసి చలించిపోయిన వీరి కుమారుడు హకీం పర్వేజ్ వారి ఆశయాలను పంచుకునేందుకు ముందుకు వచ్చాడు.

నా తలకొరివి నువ్వే పెట్టాలి బిడ్డా!

ఆశ్రమంలో ఐదేళ్ల నుంచి ఉంటున్న ఓ వృద్ధురాలు తనువు చాలించింది. తాను చనిపోతే తల కొరివి నువ్వే పెట్టాలన్న వృద్ధురాలి కోరిక మేరకు హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాడు పర్వేజ్. సామాజిక కట్టుబాట్లు కన్నా... మానవత్వమే తమ మతం అని నిరూపించాడు. సహృదయ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న ముస్లిం దంపతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మానవత్వం పరిమళించే మంచి మనుషులు అంటూ చుట్టుపక్కల వారంతా కొనియాడారు.

వృద్ధురాళ్లకు అతను మరో కొడుకు

ఇదీ చూడండి: ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Intro:Tg_wgl_01_04_humanity_muslim_yuvakudu_pkg_bytes

Body: ( ) ఈ రోజుల్లో రాజకీయ వారసులు సహజం ..కన్నవారి ఆస్తులు పంచుకునే వారసులు సర్వసాధారణం..... కానీ మానవత్వాన్ని చాటడంలో తల్లిదండ్రుల ఆశయాలు పంచుకునే వారసులు ఎంతమంది .వరంగల్ లోని వృద్ధాశ్రమం నిర్వాహకులు అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదరిస్తే ఆ దంపతుల కుమారుడు ఆశ్రమంలో తనువు చాలించిన అనాథ వృద్ధులకు తల కొరివి పెట్టి మానవత్వాన్ని బతికేస్తున్నాడు .కన్న బిడ్డలు కాదనుకున్న వృద్ధులకు ఆ యువకుడు దేవుడిచ్చిన బిడ్డల కర్మకాండ నిర్వహించి మానవత్వం అనే పదానికి నిర్వచనం తెలిపాడు....Look
V.O.1: సామాజిక కట్టుబాట్లు కాదని ఓ ముస్లిం యువకుడు ఓ అనాధ అ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. హన్మకొండలోని సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న చోటే మియా యాకూబ్ బి ముస్లిం దంపతులు ఎంతోమంది అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు .కన్న బిడ్డలు కాదని బజారున పడేసిన ఇలాంటి వృద్ధులకు కూతురి ప్రేమను, కొడుకు ఆప్యాయతను పంచుతున్నారు. వీరి నీడలో తనువు చాలించిన వృద్ధులకు ముస్లిం దంపతులే కర్మకాండ నిర్వహించి మానవత్వాన్ని చాటుతున్నారు. తల్లిదండ్రుల సేవా భావాన్ని చూసి చలించిపోయిన వీరి కుమారుడు హకీం పర్వేజ్ తల్లిదండ్రుల ఆశయాలను పంచుకునేందుకు ముందుకు వచ్చాడు. వీరి ఆశ్రమంలో లో ఐదేళ్ల నుంచి ఆశ్రమం పొందుతున్న దేవుడమ్మ అనే వృద్ధురాలు తనువు చాలించింది. ఈ క్రమంలో లో ఆ వృద్ధురాలికి తన చేతితో తల కొరివి పెట్టడాని హకీం పర్వేజ్ ముందుకు వచ్చాడు....బైట్
యాకుబి, సహృదయ వృధాశ్రమం, నిర్వహకురాలు.
V.O: హైందవ సంప్రదాయ ప్రకారం హన్మకొండ లోని స్మశాన వాటికలో వృద్ధురాలికి ముస్లిం యువకుడు పర్వేజ్ అంత్యక్రియలు నిర్వహించాడు .బీటెక్ చేస్తున్న పర్వేజ్ ఆశ్రమం లో ఉన్నప్పుడు ఆ వృద్ధురాలు ఒక కోరిక కోరింది బిడ్డ.... నేను కాలం చెందినప్పుడు నువ్వే నా అంత్యక్రియలు నిర్వహించాలని ఆ యువకుని వేడుకుంది. అప్పుడు సరదాగా తలూపిన పర్వేజ్ ఆ వృద్ధురాలి చివరి కోరికను నెరవేర్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వృద్ధురాలికి దహన సంస్కారాలు చేశాడు. వృద్ధురాలికి కొడుకు లేని లోటును తీర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు...Byte
హకీమ్ పర్వేజ్, , అంతక్రియలు నిర్వహించిన ముస్లిం యువకుడు
END: సామాజిక కట్టుబాట్లు కాదని మానవత్వమే తమ మతం అని నిరూపించాడు ఈ ముస్లిం యువకుడు. సహృదయ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న ఈ ముస్లిం దంపతులు మానవత్వం లో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సంఘటన అందరిని కదిలించింది. మానవత్వం పరిమళించే మంచి మనుషులు అంటూ చుట్టుపక్కల వారంతా కొనియాడారు.
G. ramesh contributer, janma kinda
9394450194

Conclusion:humanity muslim yuvakudu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.