దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచాలన్న రాష్ట్రపతి కోవింద్ సూచన... ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. ప్రాంతీయ భాషల్లోకి తీర్పుల అనువాదానికి వీలుగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ చెప్పారు. తీర్పు వెలువరించిన రోజున ఇంగ్లిష్‌లో సంబంధిత కాపీలు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రాంతీయ భాషల్లోకి మార్చడానికి వారం రోజల సమయం పట్టనుంది. తెలుగుతోపాటు హిందీ, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లోకి తీర్పులు అనువదిస్తారు.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన