అమెరికాలోని అయోవా రాష్ట్రంలో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని సుంకర చంద్రశేఖర్, సుంకర లావణ్యగా గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు బాలుర మృతదేహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అన్ని మృతదేహాలపై తూటా గాయాలున్నాయి. మరణాలకు గల కారణాలు గుర్తించేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు చంద్రశేఖర్ ఏపీలోని గుంటూరు జిల్లా చుండూరులో చదువుకున్నారు. అనంతరం చదువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాడు. అతని తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: అనంతగిరిలో వృద్ధదంపతుల దారుణ హత్య