ETV Bharat / briefs

తెరాసకు 12 నుంచి 16 స్థానాలు: ఎగ్జిట్ పోల్స్

లోక్​సభ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. అన్ని సంస్థలు తెరాసకే అధిక స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. సర్వే ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.

telangana loksabha survey
author img

By

Published : May 19, 2019, 9:36 PM IST

Updated : May 19, 2019, 10:34 PM IST

తెరాసకు అధిక స్థానాలు...

లోక్​సభ ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలు గెలుస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. గులాబీ పార్టీ 12 నుంచి 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని పేర్కొన్నాయి. లగడపాటి సర్వే తప్ప మిగతా అన్ని సర్వేల్లో భాజపా ఒక స్థానం సాధిస్తుందని వెల్లడించాయి. ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటుందని తెలిపాయి.

ఆంధ్రా అక్టోపాస్​ లగడపాటి రాజగోపాల్‌ సర్వేలో తెరాసదే హవా అని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియో సమావేశంలో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను వెల్లడించారు లగడపాటి. తెరాసకు 14 నుంచి 16 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు సున్న నుంచి 2 స్థానాల వరకు రావొచ్చని అన్నారు. భాజపాకు ఒక్క సీటు కూడా రాదని... ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని లగడపాటి తెలిపారు.

లోక్​సభ ఎన్నికల్లో కారు రేసు మీదుందని సీ ఓటర్‌ సర్వే స్పష్టంచేసింది. తెరాస 14 సీట్లు సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌, భాజపా, మజ్లిస్‌ ఒక్కో స్థానం కైవసం చేసుకుంటుందని పేర్కొంది. తెరాస అత్యధిక స్థానాలు సాధిస్తుందని ఇండియా టుడే తెలిపింది. గులాబీ పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని స్పష్టంచేసింది. కాంగ్రెస్‌, భాజపాలు ఒకటి నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంఐఎం ఒకస్థానం గెలుచుకుంటుందని పేర్కొంది.

ఓటర్లు కారుకే పట్టం కట్టారని న్యూస్‌-18 సర్వే స్పష్టం చేసింది. తెరాస 12 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్‌, భాజపాలు ఒకటి నుంచి రెండు స్థానాలు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. మజ్లీస్ ఒక స్థానం గెలుస్తుందని తెలిపింది.

గులాబీ పార్టీ అత్యధిక సీట్ల వస్తాయని టైమ్స్‌ నౌ సర్వే పేర్కొంది. తెరాసకు 13, కాంగ్రెస్​కు 2, భాజపా, మజ్లిస్​కు ఒక్కో సీటు వస్తుందని వెల్లడించింది. తెరాసకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని టుడేస్‌ చాణక్య అంచనా వేసింది. కాంగ్రెస్, భాజపా ఒకటి నుంచి రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని పేర్కొంది.

Intro:Body:Conclusion:
Last Updated : May 19, 2019, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.