ETV Bharat / briefs

"మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు గడువు కావాలి"

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ విడివిడిగా చేపట్టడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎన్నికల ముందస్తు ప్రక్రియ నిర్వహించడానికి సుమారు 5 నెలల గడువు పడుతుందని నివేదికలో పేర్కొంది.

author img

By

Published : Jun 19, 2019, 5:17 AM IST

"మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు గడువు కావాలి"
"మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు గడువు కావాలి"

రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ విడివిడిగా చేపట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. గ్రామ పంచాయతీల విలీనంతో పాటు.. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం వల్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటే ఐదు నెలల సమయం పడుతుందని తెలిపింది.

హైకోర్టులో ఎస్​ఈసీ పిటిషన్

మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జులై 2తో ముగియనున్నందున ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైనా.. వాటి పాలకతేదీలు ముగిసిన తర్వాతే విలీనం పూర్తవుతుంది.

నేడు విచారణ

జులై 2న పదవీకాలం ముగిసే 56 మున్సిపాలిటీలలో కొన్ని పంచాయతీల విలీనం పూర్తి కావాల్సి ఉందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్​ను పరిశీలించిన జస్టిస్ నవీన్ రావు పిటిషన్​పై ఈరోజు విచారణ చేపడతామన్నారు.

ఇదీ చూడండి : పార్లమెంటులో వ్యూహాలపై విపక్షాల భేటీ

Intro:Body:

s

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.