తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల కోసం ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే పబ్లిక్ గార్డెన్లోని వేదికతోపాటు...సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు... డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీఐపీల కోసం ప్రత్యేక మార్గం..
వీఐపీల వాహనాలు ఒక గేటు నుంచి... మిగతా వాహనాలు మరో గేటు నుంచి లోపటికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులతో పాటు... విద్యార్థులు, రైతు సమాఖ్య ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.