భాజపా ఖాతా నుంచి పట్టుబడ్డ 8 కోట్ల సొమ్ముపై మంత్రి తలసాని శ్రీనివాస్ ఈసీకి, ఐటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా... భారీ మొత్తంలో నగదును తీయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి అవినీతి సొమ్ముపై గంభీరమైన వ్యాఖ్యలు చేస్తారని... మరి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ 500 రూపాయలు కూడా చెక్కు రూపంలోనే బదిలీ చేయాలని నీతి కబుర్లు చెబుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ప్రజలకు పంచడానికే నగదు ఖాతా నుంచి తీశారని ఆరోపించారు. ఈ డబ్బుపై న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ సంపన్నులకు మాత్రమే చౌకీదార్: అసదుద్దీన్ ఓవైసీ