కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైపోయిందని... సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేసులు నమోదైన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సబబు కాదన్నారు. అమిత్‌షా వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అన్ని ఎక్కువ బాధ్యతలు కట్టబెడుతారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించిన తీరు అన్ని వర్గాల విమర్శలకు కారణమైందని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: 'ధోనీ ఆ బ్యాడ్జి ధరించడంలో తప్పేమీ లేదు'