రాష్ట్రం నింపుల కుంపటిని తలపిస్తోంది. సూర్యుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. పలు జిల్లాల్లో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లి, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా... సంగారెడ్డి, సూర్యాపేటలో 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఎండ వేడికి తాళలేక ప్రజలు ఇంటి నుంచి బయటకు రావటానికి భయపడుతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
వర్ష సూచన...
మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం