ఇటీవల వెలువడిన తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో అర్హత సాధించి ర్యాంక్ రాకుండా ఉన్న విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య భరోసా ఇచ్చారు. దరఖాస్తు సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం హాల్ టికెట్ జతపరిచిన వారికి, సీబీఎస్సీ విద్యార్థులకు ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా, ఎంసెట్ 2019 వెబ్సైట్లో సంబంధిత వివరాలను జత పరిచేందుకు ఆప్షన్ ఉంటుందని, అక్కడ హాల్ టికెట్, మార్కుల మెమోను స్కాన్ చేస్తే విద్యార్థుల ర్యాంకు అప్డేట్ అవుతుందని స్పష్టం చేశారు. https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_Homepage.aspx లో లాగిన్ అయి వివరాలు జతపరచాలని సూచించారు.
ఇవీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై