కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి 'విక్రమ్ వేద' రీమేక్‌లో నటిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవన్నీ వదంతులేనని తేలింది. ఆ సినిమా హక్కులు ఎవరికీ అమ్మలేదని, తమ దగ్గరే ఉన్నాయని వై నాట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన 'విక్రమ్ వేద' తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రతినాయకుడిగా విజయ్ నటిస్తే, పోలీస్ అధికారి పాత్రలో మాధవన్ కనిపించాడు. టాలీవుడ్లో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా రీమేక్‌లో వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని ఇంతకు ముందు వార్తలొచ్చాయి. కానీ అవి నిజం కాదని తర్వాత తేలింది.