ETV Bharat / briefs

సుశాంత్ శవపరీక్ష విశ్లేషణకు ఎయిమ్స్ బృందం - సుశాంత్​ సీబీఐ

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య నివేదికను విశ్లేషించి.. మెడికో-లీగల్​ అభిప్రాయం తెలపనుంది దిల్లీ ఎయిమ్స్​ ఫోరెన్సిస్​ బృందం. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ ప్రక్రియ జరగనుంది.

SSR
సుశాంత్
author img

By

Published : Aug 22, 2020, 9:37 AM IST

Updated : Aug 22, 2020, 9:49 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య నివేదికను దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం విశ్లేషించనుంది. పోస్టుమార్టం రిపోర్టుతోపాటు సుశాంత్ శరీరంపై ఉన్న గాయాలను వైద్యపరంగా పరిశోధన జరిపి మెడికో లీగల్ అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఇందుకోసం ఎయిమ్స్ అయిదుగురితో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ ప్రక్రియను జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి ఫోరెన్సిక్​ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు.

సుశాంత్ పోస్టుమార్టం నివేదిక, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అతడి శరీరంపై గాయాలు, ఇతర అంశాలను విశ్లేషించి నటుడి మరణంపై మెడికో-లీగల్ అభిప్రాయం చెబుతామన్నారు గుప్తా. దీని కోసం ఫోరెన్సిక్ నిఫుణులతో ఒక మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే సుశాంత్ ఎలా చనిపోయాడనే విషయం చెప్పగలమని అన్నారు.

సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నటుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు ఇటీవల సీబీఐకి అప్పగించింది. దీంతో మెడికో-లీగల్ అభిప్రాయం కోసం దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాన్ని సీబీఐ ఆశ్రయించింది. డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్ బృందం.. నటుడి మరణం నివేదికను విశ్లేషించనుంది.

ఇది చూడండి చిరు బర్త్​డే: 'పునాదిరాళ్లు' నుంచి ఏమాత్రం తగ్గని 'మెగా' జోరు

Last Updated : Aug 22, 2020, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.