కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా నేతలు అవహగాహన లేమితో మాట్లాడుతున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత డబ్బుతో నిర్మించిందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ ఆ పార్టీ నేతలు తమ వల్లే వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అన్ని అనుమతులు ఉన్నా అక్కడ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగడంలేదని ప్రశ్నించారు. ఫిరాయింపులపై మాట్లాడుతున్న భాజపా నేతలు పశ్చిమ బంగాలో తృణమూల్ నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి పెట్టి మాట్లాడాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు.
ఇదీ చూడండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన