ETV Bharat / briefs

తెలంగాణలో గెలిచిన సిట్టింగ్​ ఎంపీలు...

తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8 మంది సిట్టింగ్​ ఎంపీలలో నలుగురు మాత్రమే విజయం సాధించారు. ఆ నలుగురు అదే స్థానం, అదే పార్టీ నుంచి జయకేతనం ఎగురవేశారు. సిట్టింగ్​ ఎంపీలలో బి.బి పాటిల్​, పసునూరి దయాకర్​, కొత్త ప్రభాకర్​రెడ్డి, అసదుద్దీన్​ ఒవైసీలు గెలుపొందారు.

తెలంగాణలో గెలిచిన సిట్టింగ్​ ఎంపీలు...
author img

By

Published : May 23, 2019, 10:51 PM IST

Updated : May 23, 2019, 11:04 PM IST

తెలంగాణలో గెలిచిన సిట్టింగ్​ ఎంపీలు...

తెలంగాణ పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేసిన సిట్టింగ్​ ఎంపీల్లో నలుగురు విజయభేరీ మోగించారు. ప్రజల్లో తమపై గల నమ్మకాన్ని నిరూపించుకున్నారు. పోటీ చేసిన 8మంది సిట్టింగ్​ ఎంపీలలో బి.బి పాటిల్​, కొత్తప్రభాకర్​రెడ్డి, పసునూరి దయాకర్​, అసదుద్దీన్​ ఒవైసీలు జయకేతనం ఎగురవేశారు.

సంక్షేమమే అస్త్రం

జహీరాబాద్ లోక్​సభ పోరులో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​ మోహనరావుపై 4,471 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెరాస సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆ పార్టీ నేతలు సఫలీకృతులయ్యారు.

వరుసగా నాలుగోసారి..

హైదరాబాద్​ పార్లమెంట్ స్థానంపై అసదుద్దీన్ మరోసారి జెండా ఎగురవేశారు. వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి భగవంత్​ రావుపై 2 లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా
ఓరుగల్లు ఖిల్లాలో గులాబీ జెండా ఎగిరింది. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఉప ఎన్నికల్లో 4 లక్షల 59 వేల మెజార్టీ సాధించి.... రికార్డు నెలకొల్పిన పసునూరి దయాకర్​ ఈ సారి 2 లక్షల 79 వేల 888 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఊహించిన విజయమే..

అందరూ ఊహించినట్లుగానే మెదక్​ పార్లమెంటరీ స్థానంలో తెరాస నేత కొత్త ప్రభాకర్​రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి గాలి అనిల్​కుమార్​పై 3లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో జయభేరీ మోగించారు. ప్రభాకర్​రెడ్డి విజయం సాధించటం వల్ల గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Intro:FILENAME: TG_KRN_32_23_TRS_WIN_AVB_C7,
A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST) 9394450191

Body:gb

Conclusion:
Last Updated : May 23, 2019, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.