సీబీఐ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపై విచారణకు సిట్ కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం, సీబీఐ స్పందించాయి.
కొందరు ఉన్నతాధికారుల ఫోన్లు అనుమతిలేకుండా అక్రమంగా ట్యాప్ చేసినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజంలేదని దిల్లీ హైకోర్టులో బదులిచ్చాయి. సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఫోన్లను ట్యాప్ చేయలేదని దిల్లీ హైకోర్టుకు తెలిపాయి కేంద్రం, సీబీఐ.