సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. ముద్దుగా సీతాపాప అని పిలుస్తుంటాడు. అతడు ప్రస్తుతం నటిస్తున్న ‘మహర్షి’ సెట్లో ఈ చిన్నారి సందడి చేసింది. షూటింగ్ విరామంలో ఈ తండ్రీకూతుళ్లు కాసేపు సరదాగా ముచ్చట్లాడుకున్నారు. ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశాడు మహేశ్ బాబు. అవి ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
ఇటీవలే బాహుబలి, శ్రీమంతుడు సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేసి అదరగొట్టింది సితార.
ఇప్పటికే విడుదలైన మహర్షి తొలి పాట 'చోటీ చోటీ బాతే' సంగీత ప్రియలను ఆకట్టుకుంటోంది. అల్లరి నరేశ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">