ETV Bharat / briefs

ఆటగాళ్లు ప్రమాదానికి ఎదురెళ్తున్నారు: అజారుద్దీన్ - Mohammed Azharuddin says Cricket needs to restart

కరోనా కారణంగా నెలల తరబడి నిలిచిపోయిన క్రికెట్​ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్​ మహ్మద్ అజారుద్దీన్​ తెలిపారు. కరోనా ముప్పు తగ్గిన తర్వాతే మ్యాచ్​ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు .

Mohammed Azharuddin
మహమ్మద్​ అజారుద్దీన్​
author img

By

Published : Jun 13, 2020, 9:22 PM IST

Updated : Jun 13, 2020, 9:53 PM IST

కరోనాతో విధించిన లాక్​డౌన్​తో వచ్చిన సుదీర్ఘ విరామం అనంతరం క్రికెట్​ను పునః ప్రారంభించాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్​ మహ్మద్​ అజారుద్దీన్​ అన్నారు. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు క్రికెట్​ టోర్నీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, ఆంక్షల సడలింపుల్లో భాగంగా ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ జట్ల మధ్య జరగనున్న 3 టెస్టుల సిరీస్​ కోసం క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటలో లాలాజలం నిషేధంతో పాటు ఐసీసీ ప్రకటించిన నిబంధనలపై స్పందించారు అజారుద్దీన్​. ఇంగ్లాండ్-వెస్టిండీస్​ సిరీస్ ప్రారంభమయ్యాకే అన్ని విషయాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

"బంతిపై లాలాజలం రాయడం నిషేధించడం వల్ల మైదానంలో చాలా కష్టమవుతుంది. నా దగ్గరకు బంతి వస్తే.. వేరొకరికి అందించే ముందు లాలాజలంతో రుద్ది మెరిసేలా చేస్తా. క్రికెట్​ను పునఃప్రారంభించాలి కానీ, ఈ మార్గదర్శకాలను పాటించడం అంత తేలిక కాదు. ఇంగ్లాండ్​- వెస్టిండీస్​ మ్యాచ్​లు జరిగేంత వరకు ఏది సరైనది? ఏది తప్పు అని నిర్ధారించడం కాస్త కష్టమే.

-అజారుద్దీన్​, భారత మాజీ క్రికెటర్​

"ఓ రకంగా చెప్పాలంటే ఆటగాళ్లు ప్రమాదానికి ఎదురెళ్తున్నారు. తాకకుండా​ క్రికెట్​ ఆడటం కష్టం. ఆటగాళ్లందరికీ ఉన్నది ఒకే ఒక బంతి. దాన్ని అభిమానులూ తాకుతారు. కాబట్టి బోర్డు సభ్యులు వీలైనంత త్వరగా ఈ విషయంపై కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే క్రికెట్​ను పునఃప్రారంభించాలి. ఎందుకంటే ఆట కంటే ఆరోగ్యం ముఖ్యం" అని అజారుద్దీన్​ తెలిపారు.

Last Updated : Jun 13, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.