మలేసియా ఓపెన్‌లో ఇండియా క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్.. తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఖోసిట్ ఫెప్రాదబ్ చేతిలో 22-20,15-21,10-21 తేడాతో ఓడిపోయింది.
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. జపాన్‌కు చెందిన అయా ఒహోరిపై సింధు గెలుపొందగా, ఇండోనేసియా ఆటగాడు మౌలానాపై శ్రీకాంత్ విజయం సాధించాడు.
పురుషుల సింగిల్స్ క్రీడాకారులు హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు.
పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్ రెడ్డి జంట మొదటి రౌండ్లోనే ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది.