ETV Bharat / briefs

మార్చిలో పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం, ఐఐపీ - ద్రవ్యోల్బణం

Retail Inflation Increase: రిజర్వ్‌ బ్యాంక్‌ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతాన్ని.. రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెల దాటింది. మార్చిలో 17 నెలల గరిష్ఠమైన 6.95 శాతానికి చేరింది. నూనెలు, కొవ్వుల విభాగ ద్రవ్యోల్బణం మార్చిలో 18.79 శాతానికి పెరిగింది. గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి రంగాలు మెరుగ్గా రాణించడం వల్ల 1.7 శాతం మేర పారిశ్రామిక వృద్ధిని నమోదు చేసింది.

retail inflation
retail inflation
author img

By

Published : Apr 13, 2022, 4:27 AM IST

Updated : Apr 13, 2022, 4:43 AM IST

Retail Inflation Increase: ఆహార వస్తువులు ప్రియం కావడం వల్ల మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠమైన 6.95 శాతానికి చేరింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతాన్ని మించడం వరుసగా ఇది మూడో నెల. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2020 అక్టోబరులో 7.61 శాతం కాగా, ఆ తరవాత గరిష్ఠ స్థాయి ఇదే. 2022 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 7.68 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 5.85 శాతం. 2021 మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.52 శాతం అయితే, ఆహార ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉంది. 2022 జనవరి-మార్చి సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.34 శాతంగా నమోదైంది.

నూనెలు.. సలసల.. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నూనెలు, కొవ్వుల విభాగ ద్రవ్యోల్బణం మార్చిలో 18.79 శాతానికి పెరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు మండిపోవడం ఇందుకు నేపథ్యం. పొద్దుతిరుగుడు పువ్వు నూనె మనదేశానికి ప్రధానంగా ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి అయ్యేది. కూరగాయల ధరలు 11.64%; మాంసం, చేపల ధరలు 9.63 శాతం ప్రియం అయ్యాయి. దేశీయంగా ఇంధన ధరలు మార్చిలో పెద్దగా పెరగనందున, ఈ విభాగ ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్‌ గణాంకాల్లో ఆ ప్రభావం కనిపిస్తుంది.

పారిశ్రామికం.. రాణించింది.. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి రాణించింది. గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి రంగాలు మెరుగ్గా రాణించడం వల్ల 1.7 శాతం మేర వృద్ధిని నమోదు చేసిందని మంగళవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 3.2 శాతం క్షీణించింది. ఈ ఏడాది జనవరిలో వృద్ధి 1.5 శాతంగా ఉంది.

ఏడాది వ్యవధిలో.. గనుల రంగం 4.4% క్షీణత నుంచి 4.5% వృద్ధికి చేరింది. తయారీ 3.4% క్షీణత నుంచి 0.8% రాణించింది. విద్యుదుత్పత్తి 0.1% నుంచి 4.5 శాతానికి పెరిగింది. యంత్ర పరికరాల రంగం -4.2% నుంచి 1.1% వృద్ధికి చేరింది. మన్నికైన వినియోగదారు వస్తువుల విభాగం 6.6% వృద్ధి నుంచి 8.2% క్షీణత నమోదు చేసింది. సూచీలో 35% వాటా ఉండే ప్రాథమిక వస్తువుల విభాగం -4.6% నుంచి 4.6% వృద్ధికి చేరింది. ఏప్రిల్‌-ఫిబ్రవరిలో 12.5%: 2021-22 ఏప్రిల్‌-ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 12.5 శాతంగా నమోదైంది. 2020-21 ఇదే సమయంలో 11.1% క్షీణించింది.

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానానికి అదానీ

Last Updated : Apr 13, 2022, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.