ETV Bharat / briefs

మూడు లక్షల జరిమానాతో 'రెరా' గడువు పొడిగింపు

స్థిరాస్తి ప్రాజెక్టులు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు జులై నెలాఖరు వరకు అధికారులు గడువు విధించారు. మూడు లక్షల జరిమానాతో ప్రాజెక్టులు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రెరా చట్టం అమలులోకి వచ్చి సుమారు 11 నెలలు గడుస్తున్నా... కేవలం వందల సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. సుమారు 7 వేల ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు చేయించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మూడు లక్షల జరిమానాతో 'రెరా' గడువు పొడిగింపు
author img

By

Published : Jul 4, 2019, 5:02 AM IST

Updated : Jul 4, 2019, 8:39 AM IST

RERA REGISTRATION EXTENDED
మూడు లక్షల జరిమానాతో 'రెరా' గడువు పొడిగింపు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోని స్థిరాస్తి ప్రాజెక్టులకు మూడు లక్షలు అపరాధ రుసుముతో జులై నెలాఖరు వరకు రెరా గడువు పెంచింది. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా... హెచ్చరికలు చేసినా... స్థిరాస్తి వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. మొత్తం ఏడు వేలకు పైగా స్థిరాస్థి ప్రాజెక్టులున్నప్పటికీ... రిజిస్ట్రేషన్ చేసినవి కేవలం కేవలం తొమ్మిది వందలు మాత్రమే. సుమారు పదకొండు నెలల గడువు ఇచ్చినా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం - రెరా వచ్చిన తరువాత భవన నిర్మాణ ప్రాజెక్టులన్నీ కూడా రెరా పరిధిలోకి వచ్చాయి. దీని ప్రకారం 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. 2018 ఆగస్టు 31 అంటే స్థిరాస్తి నియంత్రణ చట్టం అమలులోకి వచ్చే నాటికి సుమారు 4,947 ప్రాజెక్టులు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,985, హెచ్ఎండీఏ పరిధిలో 640, డీటీసీపీ పరిధిలో 1,122 స్థిరాస్తి ప్రాజెక్టులు ఉన్నాయి.

రెరా అమలులోకి వచ్చిన తరువాత వందల సంఖ్యలో ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. ప్రసుత్తం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన ప్రాజెక్టులు ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు హెచ్చరికలు, ప్రకటనలకు పరిమితమైన అధికారులు మూడు లక్షల జరిమానా విధించి మరో అవకాశం ఇచ్చారు. జూన్‌ 30 నాటికే గడువు ముగిసినా ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అప్పటికీ స్థిరాస్తి వ్యాపారులు ముందుకు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు

Intro:Body:Conclusion:
Last Updated : Jul 4, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.