ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈటా జిల్లాకు చెందిన రెహానాఖాన్‌కు 28ఏళ్లు. ఇంటర్ చదువుతుండగా రియాజ్‌తో వివాహమైంది. ఓ రోజు భర్తతో కలిసి సమీపంలోని ఎగ్జిబిషన్‌కు వెళ్లింది. అక్కడ మృత్యుబావి విన్యాసాలు చూసి అవాక్కైంది. తానూ కూడా ఆ విద్య నేర్చుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపింది. మొదట వారంతా అభ్యంతరం చెప్పినా.. తర్వాత అంగీకరించారు. భర్త సహకారంతో అతికష్టంగా మృత్యబావిలో సాహసవిన్యాసాలు నేర్చుకున్న రెహానాఖాన్.. ప్రాణాలకు తెగించి జీవనపోరాటం సాగిస్తోంది. గత ఐదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో మృత్యుబావి ప్రదర్శనలిస్తోంది. జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్లోరోజుకు 8 నుంచి 10 ప్రదర్శనలిచ్చి నగరవాసుల ప్రశంసలు అందుకుంది.
భయాన్ని జయిస్తేనే ఏదైనా సాధిస్తాం..
ద్విచక్రవాహన విన్యాసాలే కాదు. కారుతో కూడా మృత్యుబావిలో విన్యాసాలు చేయగలదు రెహానా. భయాన్ని జయిస్తే ఏదైనా సాధించవచ్చని చెబుతోంది. మహిళల్లో ధైర్యాన్ని నింపడానికే తాను ఇలాంటి ప్రదర్శనలిస్తున్నానని వివరిస్తోంది.
గర్భవతిగా కూడా ప్రదర్శనలు
రెహానాఖాన్ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శనలివడం విశేషం. ప్రస్తుతం రెహానాకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. కొడుకును తల్లి దగ్గర వదిలి ప్రదర్శనలిస్తుంటుంది. ప్రదర్శనల మధ్యలో ఇంటికి వెళ్లి వస్తూ.. అటు తల్లి ప్రేమను, ఇటు కుటుంబబాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. భయాన్ని జయిస్తే ఏదైనా సాధించవచ్చని చెబుతూ ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్న రెహానా ఖాన్‌కు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఇవీ చూడండి:మానవి ఆవేదన...!