ETV Bharat / briefs

రేపూ కోల్​కతా పోలీస్​ కమిషనర్​ విచారణ - షిల్లాంగ్​

శారదా చిట్​ కుంభకోణం కేసులో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్ కుమార్​ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ.

కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్ కుమార్
author img

By

Published : Feb 10, 2019, 4:23 AM IST

శారదా చిట్​ కుంభకోణం కేసులో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్ కుమార్​ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. షిల్లాంగ్​లో జరుగుతోన్న విచారణ అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. స్వయంగా ఓ సీబీఐ అధికారే ఈ విషయం వెల్లడించారు.

ఉదయం 11 గంటలకు షిల్లాంగ్​ ఓక్లాండ్​ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నల మారథాన్​ ప్రారంభమయింది. సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

శారదా చిట్​ కుంభకోణంపై అప్పట్లో సిట్​ అధికారిగా రాజీవ్​కుమార్​ని పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియమించారు. అయితే దర్యాప్తులో కుమార్​ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో కేసును కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది.

విచారణ నిమిత్తం ముగ్గురు అధికారులతో కూడిన కేంద్ర దర్యాప్తు బృందం షిల్లాంగ్​ చేరింది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకే షిల్లాంగ్​ని ఎంచుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.