600 మంది ఇంజినీర్లు
ఇప్పటికే కొన్ని యంత్రాలు ఇందూరు చేరుకోగా... మిగతా యంత్రాలు ఇవాళ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం 600 మంది ఇంజినీర్లు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అందుబాటులో ఉండనున్నారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నందున అదనపు పోలింగ్ సిబ్బందితో పాటు సెక్టోరల్ అధికారులను కూడా వినియోగించనున్నారు. అటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి శిక్షకులతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేకాధికారి నియామకం
కేవలం నిజామాబాద్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పర్యవేక్షణ కోసం ఓ అధికారిని కూడా నియమించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం నిజామాబాద్ ఎన్నిక కోసమే ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
రజత్ పర్యటన
అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కూడా నేడు నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈవీఎంల సన్నద్ధత, పోలింగ్ ఏర్పాట్లను సీఈఓ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు యూ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఆ నమూనాను ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల ద్వారా ప్రదర్శించేలా ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చూడండి:ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్