తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాల్లో సిబ్బందికి అందజేశారు. సాయంత్రం వరకే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు.
ఉదయం 5.30కే మాక్ పోలింగ్:
రేపు ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాక్ పోలింగ్ సమయానికి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్లో మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామని రజత్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..