పబ్జీ.. ఈ ఆటంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. చాలామంది తిండి, నిద్ర మానేసి మరీ ఈ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు! తాజాగా ఓ పెళ్లిలో వరుడు పబ్జీ ఆడుతూ పక్కనున్న వధువును కూడా పట్టించుకోలేదు. ఆమె అతడి సెల్‌ఫోన్ చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పెళ్లికొడుకు ఎంత ఏకాగ్రతతో పబ్జీ ఆడుతున్నాడంటే.. వివాహానికి వచ్చిన అతిథి గిఫ్ట్ ఇస్తున్నా.. అతడి బహుమానాన్ని తిరస్కరిస్తూ నెట్టేశాడు.
నెటిజన్లు ఈ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పబ్జీని దేశంలో చాలా చోట్ల నిషేధించారు. గుజరాత్ రాజ్‌కోట్‌లో పబ్జీ ఆడినందుకు పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఆటపై నేపాల్ కూడా నిషేధం విధించింది.