రాష్ట్రంలో పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపులో మొదటి విడత ప్రక్రియ పూర్తయింది. మొత్తం 23 వేల 266 మందికి సీట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 95 వేల 850 మంది ఉత్తీర్ణులు కాగా 30 వేల 363 మంది మాత్రమే మొదటి విడతలో ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు.
135 కాలేజీల్లో 26 వేల 266 సీట్లు భర్తీ అయ్యాయి. 47 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, 18 ప్రైవేట్ కళాశాలల్లో అన్ని సీట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో 80 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన వారు ఈనెలాఖరులోగా ట్యూషన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలి'