సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికారులు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 3,044, జహీరాబాద్లోని 4 కేంద్రాల్లో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః రికార్డు స్థాయిలో నమోదవుతున్న పత్తి ధరలు