పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష... తెలంగాణ పాలిసెట్ను మంగళవారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 6వేల 380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే సుమారు 19 వేల దరఖాస్తులు తగ్గాయి. రాష్ట్రంలో 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు