రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న పోలింగ్ ముగిసింది. తొలివిడతలో 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 217 కేంద్రాల్లో పోలింగ్ పూర్తయింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన స్థానిక ఎన్నికల పోలింగ్ 4 గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వారికి కూడా ఓటేసే అవకాశముంది. మిగిలిన 1880 స్థానాలకు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్