రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 218 ఎంపీటీసీల్లోని ఓటింగ్ ప్రశాంతంగా పూర్తైంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి : అక్కడ డబ్బు పంచాడు... కటకటాలపాలయ్యాడు