ఓటర్ల జాబితా...
పురుషులు | 1,49,30,726 |
స్త్రీలు | 1,47,76,370 |
ఇతరులు | 1504 |
త్రివిధ దళాల ఓటర్లు | 11,320 |
ప్రవాస ఓటర్లు | 1731 |
మొత్తం | 2 ,97,08,600 |
అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలోనే...
ఇటీవల ప్రకటించిన అనుబంధ జాబితా కలిపి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,97,08,600 కాగా... అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 31లక్షల 49 వేల 710 మంది ఓటర్లు, అత్యల్పంగా మహబూబాబాద్‌లో 14 లక్షల 23 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు.
అందరి చూపు ఇందూరు వైపే...
185 మంది అభ్యర్థులతో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ప్రత్యేకంగా అత్యాధునిక ఎం3 ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించారు. మొత్తం 600 మంది ఇంజినీర్లతో పాటు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను కేటాయించారు.
3 లక్షలకు పైగా సిబ్బంది...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సహాయంతో జరుగుతున్న పోలింగ్ కోసం 79 వేల 882 బ్యాలెట్ యూనిట్లు, 42 వేల 853 కంట్రోల్ యూనిట్లు సహా 46 వేల 731 వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ కోసం 3 లక్షలకుపైగా సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన 55వేల మంది పోలీసు సిబ్బంది, హోంగార్డులతో పాటు 145 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నారు.
కేంద్రాలపై నిఘా నేత్రం...
పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల 604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,169 కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ చేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. మిగతా కేంద్రాల్లోనూ వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా ఉంటుంది. 5,749 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు.
7 నుంచి 5 గంటల వరకు పోలింగ్...
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్ నియోజకవర్గంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు... మిగతా అన్ని ప్రాంతాల్లో 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇవీ చూడండి: 'బాహుబలి పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు'