లోక్ సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 41.85 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. సూమారు 4 కోట్ల విలువైన 2.86 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2.75 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు, 56.19 లక్షల ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తంగా 49.10 కోట్ల మేర అక్రమ సొత్తు తనిఖీల్లో పట్టుబడినట్లుగా ఈసీ వెల్లడించింది.
ఇవీ చూడండి: ఉత్తరాన ఐటీ దాడుల కలకలం