డిగ్రీ అతిథి అధ్యాపకుల వేతనాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరండిమాండ్ చేసింది. వేతనాల విడుదల కోసం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో 33జిల్లాల అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు 8నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫోరంఅధ్యక్షుడు కిశోర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వేతనాలు చెల్లించకుంటే ఏ విధంగా నాణ్యమైన విద్యను అందిస్తారని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించకపోతే... పెన్ డౌన్‌కు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:అభ్యర్థులను వడబొస్తున్న తెరాస అధినేత