ETV Bharat / briefs

దేవరకద్రలో ఘనంగా పసుపు ఉత్సవం - devarakadra

దేవరకద్రలో పసుపు పండగను కురుమ యాదవులు ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా పసుపు ఉత్సవం
author img

By

Published : Apr 24, 2019, 5:10 PM IST

Updated : Apr 24, 2019, 7:56 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా కురుమ యాదవులు వైభవంగా నిర్వహించే బండారు ఉత్సవం ఘనంగా జరిగింది. సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని పసుపుతో బండారు ఉత్సవము నిర్వహిస్తారు. ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ పసుపు పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ఎల్లమ్మ ఆలయంలో ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించడం వల్ల ఐదేళ్లకు బదులుగా ఏడాదికోసారి మూడేళ్ల పాటు పండగను నిర్వహించాలని యాదవ పెద్దలు నిర్ణయించారు.

ఘనంగా పసుపు ఉత్సవం

ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!

Intro:Tg_Mbnr_07_24_Pasupu_Panduga_Avb_G3
ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా కురుమ యాదవులు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకునే బండారు ఉత్సవం ( పసుపు పండుగ) మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో ఘనంగా జరిగింది.

Body:కురుమ యాదవులు 5 ఏళ్ల కు ఒకసారి నిర్వహించే ఎల్లం దేవళ్ళ పేరుతో ఎల్లమ్మ ఉత్సవాలను పసుపుతో బండారు పండుగను నిర్వహించుకుంటారు. యాదవ కుటుంబాలు వారి వంశానికి వచ్చిన కొత్త కోడళ్ళు, వంశంలో పుట్టిన సంతానం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని పసుపుతో బండారు ఉత్సవము ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవానికి వారి బంధువులను గౌరవంగా ఆహ్వానిస్తారు ఉత్సవంలో పాల్గొన్న బంధువులు ఉత్సవాలు జరుపుకునే కుటుంబాలకు కొత్త బట్టలతో ఒడి బియ్యం పోసి కానుకలు సమర్పించుకుంటారు ఒక వివాహ మాదిరిగా జరిగే ఈ యాదవ కుటుంబాల బండారు ఉత్సవం దేవరకద్ర ఎల్లమ్మ ఆలయం లో ఘనంగా జరిగింది. అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఎల్లమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించుకున్న సందర్భంగా ఐదేళ్లకు బదులుగా వరుసగా మూడేళ్లు నిర్వహించాలని యాదవ పెద్దలు నిర్ణయించడంతో రెండేళ్లుగా వరుసగా బండారు ఉత్సవం నిర్వహించారు

Conclusion:దేవరకద్ర లో ఎల్లమ్మ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో పసుపు రాసుకొని బండారు ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు.
Last Updated : Apr 24, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.