జమ్ము కశ్మీర్లోని ఏ పాఠశాలపై బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. పుల్వామా జిల్లా కాకాపోరా సమీపంలోని నార్బల్ గ్రామంలో జరిగిందీ ఘటన. 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్థులకు వింటర్ ట్యూషన్లు నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.పాఠశాలపై బాంబు దాడి, విద్యార్థులకు గాయాలు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దాడిని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మలిక్ గాయపడిన ఒక్కొక్కరికీ రూ. 50 వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.