నియోజకవర్గాల వారీగా నామినేషన్లు
ఆదిలాబాద్ స్థానానికి 21 నామినేషన్లు, పెద్దపల్లి 35, కరీంనగర్ 26, నిజామాబాద్ 245, జహీరాబాద్ 22, మెదక్ 20, మల్కాజిగిరి 43, సికింద్రాబాద్ 67, హైదరాబాద్ 32, చేవెళ్ల 32, మహబూబ్‌నగర్ 34, నాగర్‌కర్నూలు 32, నల్గొండ 48, భువనగిరి 45, వరంగల్ 29, మహబూబాబాద్ 26, ఖమ్మం లోక్‌సభ స్థానానికి 38 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేటి నుంచి పరిశీలన
మంగళవారం నుంచి జరిగే నామపత్రాల పరిశీలన ప్రక్రియలో అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ప్రతిపాదించిన వ్యక్తితో పాటు మరొకరిని మాత్రమే అనుమతిస్తారు. ఫారం ఏ, బీ సక్రమంగా ఉండాలని, ఫారం 26లో అన్ని గడులు నింపని నామినేషన్లను తిరస్కరిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఉపసంహరణ అనంతరం బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ చేపడతామన్నారు.
అభ్యర్థుల క్రమం
ఈవీఎంలపై మొదటి భాగంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు, రెండవ భాగంలో గుర్తింపు పొందిన ఇతర పార్టీలు, చివరన స్వతంత్రులకు ఆంగ్ల అక్షరమాల ప్రకారం గుర్తులను కేటాయిస్తారు.
ఇదీ చూడండి:"రోడ్‌షోలు, బైక్ర్యాలీలపై నిషేధం లేదు"