ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన పరిహారం తరహాలోనే తమకూ ఇవ్వాలంటూ వట్టెం జలాశయ భూనిర్వాసితులు తమ ఆందోళన ఉధృతం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న ఈ జలాశయం పరిహారం కోసం... రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల హైదరాబాద్లోని సీఎం కార్యాలయమైన ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో వంద మందికి పైగా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు పోలీసులను ప్రతిఘటించి తప్పించుకుపోవడం వల్ల ఆ ప్రాంతమంతా కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై రైతులు, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండిః ఓరుగల్లు ఖిల్లాను సందర్శించిన రాష్ట్రమంత్రులు