అసలే ఎండాకాలం బండిపై బయటకెళ్తే ఒకటే ఉక్కుపోత. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పరిస్థితి మరీ దారుణం. అన్నీ వాహనాలు ఓకే దగ్గర ఆగడం వల్ల ఇంజిన్ల వేడి, భానుడి మంట వీటిని తట్టుకోవాలంటే మరీ కష్టం. ఈ పరిస్థితిని పోగట్టాలనుకున్నారు సిద్దిపేట నాలుగో వార్డు కౌన్సిలర్. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు సూచనతో కౌన్సిలర్ దీప్తి నాగరాజు చల్లటి నీడను ఏర్పాటు చేశారు. 30 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో చలువ పందిరిని పాత బస్టాండు సమీపంలో గల ఓ కూడలి వద్ద అమర్చారు. సిగ్నల్ పడినంత సేపు వాహనదారులు ఆ నీడన సేద తీరుతున్నారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిగ్నల్ వద్ద వాహనదారులకు ఎండలో ఇబ్బంది పడొద్దని ఆలోచించి ఈ పని చేసినట్లు కౌన్సిలర్ వెల్లడించారు.
ఇవీ చూడండి: ఏర్పాట్లు పూర్తి... త్వరలో నోటిఫికేషన్