సంతానోత్పత్తి, ఆరోగ్యం, లైంగిక వేధింపులు, శిశువులు, పిల్లల ఆరోగ్య సమస్యలు వంటి 16 ప్రధాన సమస్యలకు సలహాలు సూచనల కోసం ఏర్పాటైంది నేషనల్ హెల్ప్ లైన్ సెంటర్. 120220129 నంబరుకు ఫోన్ చేసి సమస్య చెప్తే పరిష్కార మార్గాలు, సూచనలు తెలియజేస్తారు అధికారిక సిబ్బంది.
2013-14 మధ్య కాలంలో సలాహా కేంద్రానికి వచ్చిన కాల్స్ సంఖ్య 3,12,561. ఆ మరుసటి ఏడాది 2014-15లో హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించే వారి సంఖ్యలో పెరుగుదల నమోదైంది.
2016-17 ఏడాదికి హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చే కాల్స్ సంఖ్య 78,899కి పడిపోయి భారీగా తగ్గుముఖం పట్టాయి. 2013-14 తర్వాత అతి తక్కువ కాల్స్ నమోదయ్యాయి. 2017-18, 2018-19కి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ప్రభుత్వం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల వల్లనే 2014-15లో హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని జేకేఎస్ నివేదికలో తేలింది.
ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు. 2016-17 మధ్యకాలంలో ఈ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని దిల్లీ నుంచి ఎక్కువ కాల్స్ నమోదయ్యాయి.
16 ప్రధాన సమస్యల పరిష్కార మార్గాలు, సూచనల కోసం 2008లో నేషనల్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తోంది జేకేఎస్(జనసఖ్యా స్థిరతా కోష్).