
గతేడాది జూన్ నుంచి రోవర్ సిగ్నల్స్ ఆగిపోయాయి. దశాబ్దానికి పైగా అంగారకుడిపై 45 కిలోమీటర్ల మేర ఆపర్చునిటీ ప్రయాణించింది. అరుణ గ్రహంపై కొన్ని వందల ఏళ్ల క్రితం నీటి వనరులు ఉండేవని, అక్కడ సూక్ష్మజీవులు జీవించే అవకాశముండొచ్చని ఆపర్చునిటీ నిరూపించింది. మూణ్నెల్ల పాటు పనిచేసేలా మాత్రమే ఈ రోవర్‌ను నిర్మించినా పదిహేనేళ్ల పాటు సేవలందించటం విశేషం.