ETV Bharat / briefs

ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి - mpp elections

కోరంలేకపోవడం... కో ఆప్షన్ సభ్యుల నామినేషన్​ దాఖలు చేయకపోవడం... సంఖ్యాబలం లేని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి.

mpp-post-pone
author img

By

Published : Jun 8, 2019, 12:00 AM IST

ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల మండల పరిషత్​ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోరం లేకపోవడం, మద్దతు ఇవ్వని కారణంగా... మరికొన్ని చోట్ల కో ఆప్షన్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేయకపోవడం కారణాల వల్ల వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు.

కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నికకు నామినేషన్‌ దాఖలు కానందున మెదక్‌ జిల్లా టేక్‌మల్‌, చిలప్​చేడ్, నల్గొండ జిల్లా నేరేడుచెర్ల, సూర్యాపేట జిల్లా చిలుకూరు, జనగామ జిల్లా తరిగొప్పుల, మహబూబ్‌నగర్‌ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నల్గొండ జిల్లా కేతేపల్లిలో ఏ పార్టీకి సరైన మెజార్టీ లేనందున కోఆప్షన్ సభ్యుని నామినేషన్ దాఖలు కాలేదు. కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక వాయిదాతో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పోలింగ్ వాయిదా పడింది.

నిర్ణీత సమయానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకానందున రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడుగుల మండలాల్లో ఎన్నికలు వాయిదా వేసినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా చందూర్​లో బలపరిచే సభ్యుడు లేకపోవడం వల్ల... కోరం లేనందున సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి, కంది, జయశంకర్‌ జిల్లా మహాదేవపూర్, పలిమెలో, కామారెడ్డి జిల్లా దోమకొండలో ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది.

జగిత్యాల అర్బన్‌ మండలంలో నాలుగు స్థానాలు ఉండగా రెండు తెరాస... ఒక స్థానం కాంగ్రెస్‌, మరోకటి స్వతంత్రులు గెలుచుకున్నారు. ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. కాంగ్రెస్ సభ్యురాలు వనితకు ఎంపీపీ దక్కే అవకాశం ఉన్నా... ఇద్దరు బలపరచాల్సి ఉంది. మద్దతు తెలిపేందుకు తెరాస నిరాకరించడం వల్ల ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. కో ఆప్షన్ సభ్యుడు నామినేషన్ ఉపసంహరించుకున్నందున జగిత్యాల జిల్లా సారంగాపూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా భీమిని, ఆదిలాబాద్ మావల, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి జిల్లాలో సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

వాయిదా పడిన మండల పరిషత్ ఎన్నికలను రేపు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.