ETV Bharat / briefs

ప్రేమ అనేది ఒక్క రోజుకే పరిమితమా...!

author img

By

Published : May 12, 2019, 8:15 AM IST

Updated : May 12, 2019, 11:34 AM IST

మదర్స్​డే వచ్చేసింది. ఎక్కడ లేని ప్రేమంతా ఈరోజే కనిపిస్తుంది. అమ్మతో సెల్ఫీలు దిగడం.. సామాజిక మాధ్యమాల్లో హ్యాపీ మదర్స్​డే అని పెట్టడం... మిగతా రోజుల్లో పట్టించుకోకుండా ఈరోజు మాత్రం తెగ హడావుడి చేస్తారు కొందరు. అమ్మపై ప్రేమ ఒక్క రోజుకే పరిమితం చేస్తున్నారు.

ప్రేమ అనేది ఒక్క రోజుకే పరిమితమా...!
ప్రేమ అనేది ఒక్క రోజుకే పరిమితమా...!

ఒకరు అమ్మతో సెల్ఫీ దిగి... లవ్​ యూ మామ్​ అంటూ స్టేటస్​ పెట్టుకుంటాడు. మరొకడు హ్యాపీ మదర్స్​డే అంటూ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేస్తాడు. ఈ ఒక్కరోజే అమ్మపై ఎక్కడ లేని ప్రేమంతా కనిపిస్తుంది. సంవత్సరంలో 365 రోజులు అమ్మ తన పిల్లలకు ప్రేమను పంచితే... కొంత మంది మాత్రం ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు.

ఈ ప్రపంచానికి నువ్వు పరిచయం కాకముందు నుంచే తను నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి... నొప్పిని భరించేది 80 ​నుంచి 100 డెసిబుల్స్​ వరకు మాత్రమే. నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆ మాతృమూర్తి 130 డెసిబుల్స్​ వరకు భరిస్తుంది. నీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి... నిన్ను ఈ లోకానికి పరిచయం చేస్తుంది. ఎందుకంటే తన ప్రేమ నిస్వార్థమైంది.

ఇంట్లో ఉన్న అమ్మ... ఎన్నో పనులు చేస్తోంది. అయినా గుర్తించం... ఇంకా ఏదో తక్కువైనట్లుగానే మాట్లాడుతాం. ఎక్కడో ఉన్న స్నేహితులతో గంటలు గంటలు మాట్లాడతాం. తిన్నావా అంటూ సందేశాలు పంపుతాం. పక్కనే ఉన్న అమ్మగురించి పట్టించుకోము. కానీ అమ్మ మాత్రం అలా ఆలోచించకుండా నువ్వు ఎక్కడున్నా... నీ గురించే ఆలోచిస్తుంది. ఎల్లప్పుడు నీ మంచిని కోరుకుంటుంది. నీకు ఏదైనా సమస్య వస్తే... తన సమస్యలా భావిస్తుంది. అలాంటి మాతృమూర్తికి మన ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయొద్దు.

మనల్ని జీవింతాంతం ప్రేమించే వ్యక్తిని... వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. ఎంతో మంది తల్లులు వారికి పిల్లలు ఉన్నప్పటికీ... వృద్ధాశ్రమంలో జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవైపు భర్త తోడు లేక... మరోవైపు పిల్లల ఆదరణ లేక కుమిలిపోతున్నారు. అలాంటి వాళ్లు దేశంలో ఎంతో మంది ఉన్నారు. తల్లులకు కావాల్సింది మీ ఆస్తులు కాదు... మీ నుంచి ఓ చిన్న పలకరింపు.... కాసింత ప్రేమ.

మీ ప్రేమ అనేది ఒక్క రోజుకు పరిమితం కావొద్దని కోరుకుంటూ... ఈటీవీ భారత్​ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ మదర్స్​డే.....

Intro:Body:Conclusion:
Last Updated : May 12, 2019, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.