ETV Bharat / briefs

మొరాయించిన ఈవీఎంలు... పలుచోట్ల పోలింగ్​ ఆలస్యం - moratimpu evm

ఎన్నికల సంఘం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎప్పటిలాగానే సాంకేతిక కారణాలు తప్పలేదు. పోలింగ్ ప్రారంభంలోనే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

మొరాయించిన ఈవీఎంలు
author img

By

Published : Apr 11, 2019, 8:13 AM IST

సాంకేతిక సమస్యలు ఈసారి కూడా తప్పలేదు. ఈవీఎంల మొరాయింపులతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జిల్లాపరిషత్​ బాలికోన్నత పాఠశాలలో ఈవీఎంలు మొరాయించినందున పోలింగ్​కు అంతరాయం కలిగింది. అధికారులు వేరే ఈవీఎంను తీసుకొచ్చి అమర్చారు. ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్​ అరగంట ఆలస్యమైంది. ఉదయాన్నే ఓటు వేద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో మాక్ పోలింగ్ ఆలస్యంగా జరిగింది. దేవరకద్రలోని 101వ పోలింగ్ కేంద్రంలోనూ సమయానికి ప్రారంభం కాలేదు. జగిత్యాల జిల్లా భీర్​పూర్ మండలం తాళ్లధర్మారంలో మాక్ పోలింగ్​లో ఈవీఎంలు మొరాయించాయి. రాయికల్ మండలం మూటపల్లిలో​, నారాయణపేటలోని 126వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అరగంట పాటు నిలిచిపోయింది.

మొరాయించిన ఈవీఎంలు

ఆసిఫాబాద్ లోని 182, 183, 185వ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్​ 7గంటలకు ప్రారంభం కాలేదు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పెదనెమిలి, ఎర్రపహాడ్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాలలోని 129 పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించింది.

ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం సంకెట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మార్చి కొత్తది ఏర్పాటు చేశారు.
సాంకేతిక సమస్యలు వచ్చిన చోట... అధికారులు వేరే ఈవీఎంలతో పోలింగ్ ప్రారంభించారు.

Intro:hyd_tg_04_11_morayipu_evm_ab_C10
Lsnraju: 9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈవీఎం మొరాయించడంతో మాకు పోలింగ్ ఆలస్యమైంది ఏడు గంటలకే మాకు పోలింగ్ పూర్తిచేసి ఇ పోలింగ్ సిద్ధం కావాల్సి ఉండగా ఈవీఎం మొరాయించడంతో ఈ ఆలస్యం చోటుచేసుకుంది వేరే ఈవీఎం ను తెచ్చి అమర్చడంతో మాక్ పోలింగ్ ఆలస్యంగా నిర్వహించారు దీంతో పోలింగ్ కూడా దాదాపు అరగంట ఆలస్యం చోటుచేసుకుంది ఓటు వేసేందుకు వచ్చినవారు లైన్ లోనే వేచి ఉన్నారు రు

Conclusion:బైట్: రమేష్ ప్రెసైడింగ్ అధికారి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.