జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. జూన్ 6న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని... అదే నెల రెండోవారం వరకు ఏపీ, తెలంగాణల్లో ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
ఇవీ చూడండి: 'తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా'