ETV Bharat / briefs

ప్రచారానికి పచ్చనోట్లు.. రోజుకు రెండొందలు - ETV BHARAT

ఓటుకు నోటే కాదు... ప్రచారానికి పచ్చనోట్లను యధేచ్ఛగా పంచుతున్నారు. అధికారులు ఉన్నా లేకున్నా మా పని మాదే అన్నట్లు ఉంది రాజకీయనాయకుల వ్యవహారం. రోడ్​షోలో పాల్గొనడానికి మనిషికి రెండొందల చొప్పున పైసలు పంపిణీ చేసిన ఘటన భవనగిరి జిల్లాలోని నాంపల్లిలో చోటుచేసుకుంది.

ప్రచారంలో పచ్చనోట్లు
author img

By

Published : Apr 8, 2019, 4:53 PM IST

పార్లమెంట్​ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. డబ్బు, మద్యం, బహుమతులను ఆశజూపి తమవైపు లాక్కొంటున్నారు. ప్రచారాల్లో ఎంత ఎక్కువ జనం కనబడితే అంతా బలంగా భావిస్తున్నారు. పైసలిచ్చి మరీ ప్రచారాల్లో హాజరయ్యేలా చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.41 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఎలా సాగుతున్నా... అక్రమమార్గాల్లో డబ్బు పంపిణీ మాత్రం ఆగడం లేదు.

ఒక్కొక్కరికి రెండొందలు:

భువనగిరి జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​ రోడ్​షో నిర్వహించారు. ఈ ప్రచారంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి డబ్బులు పంచడం ఈటీవీ భారత్ కంటపడింది. ఒక్కోమనిషికి రెండు వందల చొప్పున పంచారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకుండా తక్కువ డబ్బు ఇచ్చారని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.

పైసలకే జై..

ఓటు హక్కు గురించి ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా.. కొందరు పైసలకే జై కొడుతున్నారు. ఓటర్ల బలహీనతను క్యాష్​ చేసుకొంటూ రాజకీయనాయకులు డబ్బులిచ్చి ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు.

ప్రచారంలో పచ్చనోట్లు

ఇవీ చూడండి: 'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

Intro:TG_NLG_111_08_TRS_pracharam_Dabbula_Pampini_Av_c16

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం.

భువనగిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాంపల్లి మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ ప్రాచారానికి భువనగిరి తెరాస పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.నాంపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు వచ్చారు.ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు డబ్బులు వదేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు ఒక్కో మనిషికి రెండు వందల రూపాయలు చొప్పున ఇస్తామని కార్యకర్తలు కు చెప్పి వచ్చిన చెప్పినట్లుగా కాకుండా డబ్భులు ఇస్తున్నారని కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి చెందుతూ వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.