ETV Bharat / briefs

అవసరమైన చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి - SUSHMA SWARAJ

లండన్​లో హైదరాబాద్​కు చెందిన నదీముద్దీన్​ హత్యకు గురి కావడం బాధాకరమని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. నదీముద్దీన్​ మరణంపై తగు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​కు లేఖ రాశారు.

మహమూద్  అలీ
author img

By

Published : May 11, 2019, 8:13 PM IST

అవసరమైన చర్యలు తీసుకోవాలి

లండన్​లో హత్యకు గురైన నదీముద్దీన్ వ్యవహారంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్​ను హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. ఈ మేరకు ఆయన సుష్మాస్వరాజ్​కు లేఖ రాశారు. నదీముద్దీన్ హత్య బాధాకరమన్న మహమూద్ అలీ... మృతుని భార్య గర్భవతి అని లేఖలో పేర్కొన్నారు. నదీముద్దీన్ భార్యకు అండగా ఉండేందుకు ఆమె తల్లి ఆయేషా సుల్తానా లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఆయేషాకు వీసా త్వరగా ఇప్పించేలా చూడాలని కోరారు. లండన్ ఎంబసీతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.