ETV Bharat / briefs

నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... బరిలో 33 మంది

ఈ నెల 22న ముగిసిన శాసనమండలి స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

శాసన మండిలి ఓట్లు లెక్కింపు
author img

By

Published : Mar 26, 2019, 7:09 AM IST

Updated : Mar 26, 2019, 9:18 AM IST

నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... బరిలో 33 మంది
పోలింగ్​ పూర్తయిన శాసనమండలి స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 22న మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్​ - నిజామాబాద్​ - ఆదిలాబాద్ - కరీంనగర్​ పట్టభద్రుల నియోజకవర్గంలో 59.03 శాతం పోలింగ్​ నమోదైంది. వరంగల్​ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 89.25 శాతం, మెదక్​ - నిజామాబాద్ - ఆదిలాబాద్​ - కరీంనగర్​ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 83.54 శాతం పోలింగ్​ నమోదైంది.

సీఈసీ అనుమతి వచ్చాకే..

పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్​లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో ఉపాధ్యాయ మండలి స్థానానికి లెక్కింపు నల్గొండలో చేపట్టనున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. లోక్​సభ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సీఈసీ అనుమతి వచ్చాకే ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఇవాళ ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ​

ఇవి చూడండి:మొత్తం 795... నిజామాబాద్​లో 245

Intro:Body:Conclusion:
Last Updated : Mar 26, 2019, 9:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.